కరోనాను నియంత్రించడంలో భారత్‌ ఫెయిలైందా ? ఎవరిది బాధ్యత ?

-

దేశంలో కోవిడ్‌ కేసులు రోజు రోజుకీ భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజుకు 3 లక్షలకు పైగా కోవిడ్‌ కేసులు వస్తున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్, బీహార్‌తోపాటు అనేక రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కోవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. అయితే కరోనా సెకండ్‌ వేవ్‌ ఇంతగా ప్రభావం చూపడం వెనుక కారణాలు ఏమిటి ? దీనికి ఎవరు బాధ్యులు ? కరోనాను నియంత్రించడంలో భారత్‌ ఫెయిలైందా ? అంటే…

is india failed in controlling covid who is responsible

కరోనా కట్టడిలో భారత్ ఫెయిలైందా ? అంటే అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే ఇందుకు ప్రజలు, పాలకులు ఇద్దరూ బాధ్యులే. ఇందులో ఇద్దరిదీ తప్పుంది. అనేక దేశాల్లో కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌, థర్డ్‌ వేవ్‌ ప్రభావం కొనసాగింది. ఈ విషయం తెలిసి కూడా, కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ముప్పు ఉందని నిపుణులు హెచ్చరించినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఎన్నికలను నిర్వహించాయి. అన్నింటినీ ఓపెన్‌ చేసేందుకు అనుమతులు ఇచ్చారు. కరోనా ఉందనే విషయాన్ని మర్చిపోయారు.

ఇక ప్రజలు కూడా కరోనా తగ్గిందనే అనుకున్నారు. కరోనా పూర్తిగా తగ్గకుండానే జాగ్రత్తలను పాటించడం మానేశారు. బహిరంగ ప్రదేశాల్లో గుంపులుగా తిరగడం, ఏ మాత్రం జాగ్రత్తగా లేకపోవడం.. వంటి పనులు చేశారు. ఫలితంగా కోవిడ్‌ మరోమారు విజృంభించడం మొదలు పెట్టింది. ప్రస్తుతం పరిస్థితి చేయిదాటిపోయిందనే నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి నుంచి మనల్ని తప్పించడానికి ఆ దేవుడే దిగి రావాలని చాలా మంది అంటున్నారు. మరి ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news