ఇండియా మరియు వెస్ట్ ఇండీస్ జట్ల మధ్య ప్రస్తుతం మూడు మ్యాచ్ ల వన్ డే సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తి కాగా చెరో మ్యాచ్ ను గెలుచుకుని సిరీస్ 1 – 1 తో సమంగా ఉంది. వాస్తవంగా మొదటి వన్ డే లో రోహిత్ మరియు కోహ్లీలు వారిలో ఉన్నారు.. కానీ రెండవ మ్యాచ్ లో రోహిత్ మరియు కోహ్లీ లు ఇద్దరూ విశ్రాంతి పేరుతో పక్కకు తొలగిపోగా ఆ మ్యాచ్ లో ఇండియా ఘోరంగా ఓడిపోయింది. ఎందుకు వరల్డ్ కప్ సమీపిస్తున్న వేళ ఇలా ప్రయోగాలు చేస్తోంది అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం మూడవ వన్ డే మ్యాచ్ జరగనుంది, ఇందులో గెలిచిన జట్టు సిరీస్ ను గెలుచుకుంది. కనీసం నిర్ణయాత్మకమైన ఈ మ్యాచ్ లో అయినా రోహిత్ కోహ్లీలు బరిలోకి దిగుతారా అన్నది తెలియాలంటే కాసేపు వరకు ఆగాల్సిందే.
ఎందుకో ఇండియా వెస్ట్ ఇండీస్ తొ వన్ డే మ్యాచ్ ను లైట్ గా తీసుకుంటున్నారా అన్నది తెలియాల్సి ఉంది.