ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. మంగళవారం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరులో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ఎనిమిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచిందని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే నూతన విద్యుత్పాలసీని తీసుకువచ్చి చార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు.
యువతకు 20 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇస్తామని.. జాబు రావాలంటే బాబు రావాల్సిందేనని అన్నారు. సీఎం జగన్ బటన్ నొక్కడం కాదు.. బుక్కడం ఎక్కువైందని విమర్శించారు. పది రూపాయలు ప్రజలకు పంచి 90 రూపాయలు నొక్కుతున్నారని ఆరోపించారు. మరి కాసేపట్లో ముచ్చుమర్రి, బనకచర్ల ప్రాజెక్టులను సందర్శించనున్నారు చంద్రబాబు.