టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకగుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో చిరంజీవి ఒకరు. అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్గా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీ.రామారావు తరువాత ఆ స్థాయిలో అభిమానించదగ్గ నటుడు మెగాస్టార్ చిరంజీవి అంటే అతిశయోక్తి కాదు. ప్రజారాజ్యం పార్టీని పెట్టి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని పొందడంలో విఫలమై, ఆ తరువాత తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరక ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రత్యేక కథనాన్ని కూడా ప్రసారం చేసింది. చిరు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయనకు రాజ్యసభ స్థానం కూడా ఖరారు అయ్యిపోయింది అని టాక్ వినిపిస్తుంది.అయితే దీనంతటికీ కారణం ఒకే ఒక్క మీటింగ్ అని తెలుస్తుంది.
అదేనండీ.. ఇటీవల చిరూ నటించిన సైరా సినిమా చూడమంటూ సీఎం జగన్ కలిసిసంగతి తెలిసిందే కదా. అప్పుడు చిరంజీవి.. ఉన్నట్టుండి సీఎం జగన్‌ను కలవనుండటం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ మీటింగ్ దగ్గర పడ్డ బీజం ఇప్పుడు చెట్టయ్యింది అని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను చేసిన తరువాత, అనూహ్యంగా చిరంజీవి దానికి మద్దతు పలికారు. దీంతో ఆయన వైసీపీలో చేరుతారన్న వార్తలకు బలం చేకూరింది. అతి త్వరలో ఇందుకు ముహూర్తం కుదురుతుందని, జగన్ తో చిరంజీవి చేతులు కలిపేది ఖాయమన్న వార్తలు ప్రస్తుతం షికార్లు కొడుతున్నాయ.