అమ్మాయిలకు కుడిచెంప పై పుట్టుమచ్చ ఉంటే అదృష్టమేనా..?

-

పుట్టుకతోనే మన శరీరంపై అక్కడక్కడా పుట్టుమచ్చలు ఉంటాయి. వీటికి సైంటిఫిక్‌గా ఏదో ఒక కారణం చెప్తారు కానీ.. జ్యోతిష్యపరంగా పుట్టుమచ్చే ఉండే ప్రతిచోటుకు ఒక అర్థం ఉంటుంది. అది ఆ మనిషి వ్యక్తిత్వాన్ని, అదృష్టాన్ని సూచిస్తుందని చెప్తుంటారు. కొన్ని విషయాలకు ఆధారాలు లేకున్నా..వినడానికి ఇంట్రస్టింగ్‌గా ఉంటాయి.. అలాంటి టాపిక్స్‌లో ఇదీ ఒకటీ..! ఇప్పుడు చెప్పుకోబోయే ప్లేసులో పుట్టుమచ్చలు ఉంటే మీరు చాలా అదృష్టవంతులట.. మరీ అవేంటో చూద్దామా..!

నుదుటిపై పుట్టు మచ్చ ఉన్న వారి మైండ్ చాలా షార్ప్‌గా ఉంటుందట… ఏదైనా నేర్చుకునే స్వభావం ఉంటుంది. ఈ రకమైన వ్యక్తులు వ్యాపారం, ఉద్యోగం.. రెండింటిలోనూ విజయాలు సాధిస్తారు. వీరు అందరికీ ప్రియమైన వారిగా ఉంటారట..

ఎవరికైనా నుదిటికి సరిగ్గా మధ్యలో పుట్టు మచ్చ ఉంటే.. వారి వ్యక్తిత్వం చాలా ఆకర్షణీయంగా ఉంటుందని నమ్ముతారు. ఈ వ్యక్తులు ఎంతో సంతోషంగా ఉంటారట. అందువల్ల ప్రతి వ్యక్తితోనూ వీరి సంబంధం పాజిటివ్‌గానూ.. చాలా బలంగా ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెప్తోంది.

ఒక వ్యక్తి తన చెంపపై మచ్చతో జన్మిస్తే… అలాంటి వ్యక్తులు ఉద్యోగ, వ్యాపారాల్లో చాలా ఉత్సాహంగా ఉంటారట.. వీరు తన లక్ష్యాలను సాధించడానికి ఎంతకైనా వెళ్లవచ్చు. లక్ష్యం కోసం అహర్నిశలు పనిచేస్తారు.

ఎవరికైనా కుడి చెంపపై పుట్టుమచ్చ ఉంటే… వారు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఒకవేళ స్త్రీకి కుడి చెంపపై పుట్టు మచ్చ ఉంటే వారు అదృష్టవంతులు. అలాంటి మహిళలు సమాజంలో గౌరవనీయమైన వ్యక్తిని వివాహం చేసుకుంటారట.

ఒక వ్యక్తికి మెడ వెనుక భాగంలో పుట్టుమచ్చ ఉంటే ఈ రకమైన వ్యక్తులు చాలా దూకుడుగా ఉంటారు. వీరు అన్ని విషయాల్లో దూకుడు ప్రదర్శిస్తారు. ఆవేశపూరితంగా వ్యహరిస్తారు. కోపం ఎక్కువగా ఉంటుందట.

సో అది మ్యాటర్‌.. ఇంతకీ లిస్ట్‌లో మీరు ఉన్నారా..! వీటికి ఏంటి ప్రూఫ్‌, ఆధారాలు లేవు అంటారేమో.. సైన్స్‌ సమాధానం చెప్పలేనివి ఈరోజుకు చాలా ఉన్నాయి. వాటికి మనిషి దైవం రంగుపులిమేశాడు. జోతిష్యశాస్త్రం ప్రకారం అందించిన సమాచారమే మేము ఇక్కడ రాయడం జరిగింది కానీ.. మనలోకం సొంతంగా ఊహించుకుని రాసింది కాదని గమనించగలరు.!

Read more RELATED
Recommended to you

Latest news