పక్క గదిలో అలజడి.. ప్రియుడితో కూతురు ఆ పని చేస్తూ..

ప్రేమ ఒక మధుర జ్ఞాపకం. ప్రేమలో ఉన్న జంట ఈ లోకాన్ని మరిచి మధురానుభూతిలో విహరిస్తుంటారు.. కానీ కొందరు.. ప్రేమలో ఉన్న సమయంలో విచక్షణా జ్ఞానం కోల్పోయి ఎవరితో ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని పక్కన పెట్టి.. చివరకు ఎంతటి దారుణాలు చేయడానికైనా సిద్ధమవుతుంటారు. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జార్ఖండ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. వేకువజామున పక్క గదిలో అలికిడి రావడంతో తల్లి చూద్దామని వెళ్లింది. అయితే గదిలో తన కూతురు.. ప్రియుడితో కలిసి అసభ్యకర స్థితిలో ఉండడం చూసి అవాకయ్యాయింది. యువకుడిని నిలదీయడంతో చివరకు దారుణ ఘటన చోటు చేసుకుంది. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అర్పిత్ అనే యువకుడు స్థానికంగా నివాసం ఉంటున్న బాలికను కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు.

కుటుంబ సభ్యులకు తెలీకుండా ఇద్దరూ తరచూ కలుసుకునేవారు. అయితే కొన్నాళ్లకు ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో బాలికను హెచ్చరించి, ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. అప్పటి నుంచి యువకుడికి.. బాలికను కలిసే అవకాశం లేకుండా పోయింది. ఎలాగైనా తన ప్రియురాలిని కలవాలనే ఉద్దేశంతో ఇటీవల ఓ రోజు వేకువజాము 3గంటల సమయంలో వారింటికి వెళ్లాడు. సడన్‌గా గదిలోకి వచ్చిన ప్రియుడిని చూసి బాలిక షాక్ అయింది. ఇద్దరూ గదిలో ఉన్న సమయంలో అలికిడి రావడంతో బాలిక తల్లికి అనుమానం వచ్చింది. గదిలోకి రాగానే యువకుడితో కలిసి తన కూతురు అసభ్యకర స్థితిలో ఉండడం చూసి తట్టుకోలేకపోయింది.

Free Vector | Lovers sleep in bed illustration of bedroom in night with  scattered undressed clothes

దీంతో ఆగ్రహానికి లోనైనా సదరు బాలిక తల్లి.. అర్పిత్‌పై దాడి చేసింది. దీంతో కోపోద్రేక్తుడైన సదరు యువకుడు.. కత్తితో బాలిక తల్లిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ క్రమంలో అడ్డొచ్చిన ప్రియురాలిని సుత్తితో తీవ్రంగా కొట్టాడు. వారి కేకలు విని అక్కడికి వచ్చిన బాలిక సోదరుడిపై కూడా సుత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా కొట్టడంతో బాలిక, ఆమె సోదరుడు అక్కడికక్కడే మృతి చెందారు. తర్వాత యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు గమనించి బాలిక తల్లిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడిని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.