సమంత చికిత్స కోసమే అమెరికాకి వెళ్తోందా..?

-

సమంత రుతుప్రభ… తెలుగు చిత్ర పరిశ్రమ లోకి ఏ మాయ చేసావే అనే సినిమా ద్వారా అడుగుపెట్టి నిజంగానే కుర్ర కారును ఏదో మాయ చేసింది. ఇక ఈమె మాయా వలలో స్టార్ హీరో నాగచైతన్య కూడా పడిపోయాడని చెప్పవచ్చు. ఇక అప్పటి నుంచే వీరిద్దరూ ప్రేమించుకుని ఏడు సంవత్సరాల తర్వాత వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఇక నాలుగు సంవత్సరాలు సంతోషంగా ఉన్న వీరు కారణాలు చెప్పకుండా విడిపోయారు. కారణాలు అడిగితే నాగచైతన్య ఏమో సామరస్యంగానే విడిపోయాము.. ప్రస్తుతం సమంత హ్యాపీగా ఉంది.. నేను కూడా హ్యాపీగా ఉన్నాను అంటూ సమాధానం ఇచ్చాడు.. కానీ సమంత సామరస్యంగా విడాకులు జరగలేదు.. నన్ను నాగచైతన్యను ఒకే రూమ్ లో ఉంచినప్పుడు కత్తులు లేకుండా చూసుకోవాలని కూడా చెప్పింది. దీన్ని బట్టి చూస్తే వీరి విడాకులు చాలా గొడవల మధ్య జరిగాయి అని తెలుస్తోంది.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈమె బాలీవుడ్ , హాలీవుడ్ చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మరింతగా తన ఇమేజ్ను సొంతం చేసుకుంటుంది. మరొకవైపు ఆధ్యాత్మిక సేవలో మునిగి తేలుతున్న సమంత ప్రత్యూష ఫౌండేషన్ తోపాటు మరి ఎంతోమంది బాల బాలికలకు, మహిళలకు అండగా నిలుస్తోంది. అంతేకాదు మొన్నా మధ్య వృద్ధాశ్రమాలకు కూడా విరాళాలు ప్రకటించింది. అయితే కొంతమంది హాలీవుడ్ చిత్రంలో నటించడానికి అని చెబుతుంటే మరికొంతమంది కాదు చికిత్స నిమిత్తం వెళ్తోంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఇక సమంత ఎందుకు అమెరికాకు వెళ్తోంది అనే విషయం గురించి ఇప్పుడు చూద్దాం.

తన సమస్యను పరిష్కరించుకోవడానికి సమంత అమెరికాకు వెళ్లి అక్కడే నెల రోజులపాటు ఉండబోతున్నట్లు సమాచారం. సమంత ఎలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతుందో చెప్పలేదు. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి సమంతకు చర్మ సంబంధ సమస్యలు ఉన్న విషయం తెలిసిందే . మరి ఈ సమస్యలను సాల్వ్ చేసుకోవడానికి అమెరికాకు వెళ్తుందో ఏమో.. ఆమె తిరిగి వచ్చేవరకు అసలు విషయం తెలియదనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news