అందుకే కాజల్ కి తెలుగులో అవకాశాలు రాకుండా చేస్తున్నారా..?

-

చందమామ సినిమాతో ఓవర్ నైట్ కి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇటీవల వివాహం చేసుకొని.. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ సినిమాలలో వరుసగా ఆఫర్లు దక్కించుకునే అంత అందంగా తయారయ్యింది అంటూ అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా కాజల్ తల్లి అయిన తర్వాత రెండు మూడు సినిమాలకు కమిట్ అయింది. ప్రస్తుతం యూనివర్సల్ స్టార్ కమలహాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగు వచ్చే ఏడాది ఆరంభం కంతా పూర్తి కాబోతోంది. అయితే ఆ తర్వాత వెంటనే తమిళ్, హిందీ తో పాటు తెలుగులో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేయడానికి కథలు వింటున్నట్లుగా సమాచారం.

- Advertisement -

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సీనియర్ స్టార్ హీరోలకు కాజల్ అగర్వాల్ నో చెబుతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల తెలుగు సీనియర్ స్టార్ హీరో కి జోడిగా ఈమెను హీరోయిన్ అడిగితే నో చెప్పిందని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే అదే సమయంలో కాజల్ పెద్దగా స్పందించలేదు. కానీ ఈసారి ఆ సీనియర్ హీరోకి నో చెప్పడంతో ఇండస్ట్రీలోని ఆయన సన్నిహితులు కాజల్ పై అసంతృప్తితో ఉన్నారని సమాచారం. అంతేకాదు ఆమెకు తెలుగులో ఇతర హీరోల సినిమాలలో కూడా అవకాశాలు రాకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ విషయంపై ఆమె సన్నిహితులు అటు పి ఆర్ టీం కూడా మీడియాకు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఇది నిజమే అన్న వార్తలకు బలం చేకూరుతోంది. అయితే నిజానికి ఆ సినిమా ఆఫర్ కాజల్ అగర్వాల్ కు వచ్చిందా లేదా అనేది క్లారిటీ లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇలా రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...