ఈ నోట్లు మీతో ఉన్నాయా? అయితే ఇది మీ కోసమే..

-

నల్లధనం ను వెలికి తీసేందుకు భారత ప్రధాని మోడీ పెద్ద నోట్లను అంటే రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసినట్లు ప్రకటించారు.దాంతో చాలా మంది అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. అయితే చిన్న వ్యాపారాలు చేసుకొనే వారు ప్రముఖ బ్యాంకుల వద్దకు వెళ్ళి నోట్లను మార్చుకున్నారు. కొన్ని కారణాల కొంత మంది పాత నోట్లను మార్చుకోలేకపోయారు..అలాంటి వారు సుప్రీంకోర్టు లో పిటిషన్ ను వేశారు. దీనిపై కోర్టు విచారణ ప్రారంభించింది..

2016 నోట్ల రద్దు సమయంలో తమ పాత నోట్లను పలు కారణాల వల్ల మార్చుకోలేకపోయిన పౌరుల కేసుల్లో ఆర్‌బీఐ పరిష్కారాన్ని కనుగొనవచ్చా అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రశ్నించింది. నోట్ల రద్దు సమయంలో ఒక వ్యక్తి ఆరు నెలలు కోమాలో వుంటే, అతని దగ్గర ఉన్న పాత నోట్లు అతని కుటుంబ సభ్యులకు దొరకలేదు. బహుశా లాకర్‌లో ఉండి ఉండవచ్చు. అలాంటి వారికి మీరు తప్పక పరిష్కారం అందించాలని జస్టిస్ S. అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తులలో ఒకరైన జస్టిస్ BR గవాయ్ వ్యాఖ్యానించారు.

అలాగే పిటీషనర్లలో ఒక వ్యక్తి.. నోట్ల రద్దు సమయంలో తాను విదేశాల్లో ఉండడం వల్ల పాత నోట్లను మార్చుకోలేక పోయానని పేర్కొన్నారు. ఈ విషయం పై అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి మాట్లాడుతూ.. పాత నోట్లను మార్చుకునే వెలుసుబాటును మళ్లీ కల్పించడం దాదాపు అసాధ్యం అని అత్యున్నత న్యాయస్థానం ఎదుట స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆర్బీఐ ఎదుట అలాంటి పెండింగ్ కేసులు 700 వరకు ఉన్నాయని తెలిపారు. అలాగే నోట్ల రద్దును కూడా అటార్నీ జనరల్ సమర్థించుకున్నారు. నకిలీ నోట్లు, తీవ్రవాదాన్ని అరికట్టేందుకే కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు చేసిందని, ఆ అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి ఉందని ఆయన పేర్కొన్నారు..అయితే పూర్తీ విచారణ జరిపిన అనంతరం ఈ విచారణను వచ్చే నెల 5వ తేదీకి సుప్రీం కోర్టు వాయిదా వేసింది..

Read more RELATED
Recommended to you

Latest news