ఐకాన్ స్టార్ తో ఐకాన్ మూవీ లేనట్టేనా..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా పేరు పొందారు. తన కెరియర్ లో ఎన్నో విభిన్నమైన చిత్రాలలో కూడా నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇక అల్లు అర్జున్ తో సినిమా అంటే ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ అయినా సరే తీయడానికి ఎక్కువ మక్కువ చూపుతారని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ నటించబోతున్న ఒక సినిమా టైటిల్ ని కూడా అనౌన్స్ చేసి ఆ సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. ఆ సినిమా ఏంటి? ఆ డైరెక్టర్ ఎవరో ? ఇప్పుడు చూద్దాం.

తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్ వేణు శ్రీరామ్ మొదట ఓ మై ఫ్రెండ్ చిత్రం ద్వారా డైరెక్టర్ గా పరిచయమయ్యారు. ఆ తర్వాత నేచురల్ స్టార్ నానితో MCA సినిమాతో మంచి పేరు సంపాదించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంతో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు ఈ డైరెక్టర్. దాదాపుగా ఈ చిత్రం విడుదల అయ్యి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు గడుస్తూనే ఉన్నది ఇక తన తదుపరి ప్రాజెక్టు పైన ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. ఒక స్టార్ హీరో తో సినిమా చేసినప్పటికీ డైరెక్టర్ ఖాళీగా ఉండడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్య పోవడం జరుగుతుంది.

కానీ గతంలో ప్రకటించిన ఐకాన్ చిత్రాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి సెట్స్ మీదకి తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు డైరెక్టర్ వేణు శ్రీరామ్. కానీ అల్లు అర్జున్ తో సినిమా తీయాలనుకున్నా ఎంతోమంది దర్శక నిర్మాతలకు సైతం ఎదురుచూపులే మిగిలాయి. పుష్ప చిత్రంతో ఒక్కసారిగా పాపులర్ అయిన అల్లు అర్జున్ చాలా మారిపోయారు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుచేతనే ఐకాన్ సినిమాని తెరకెక్కించలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా కోసం డైరెక్టర్ చాలా వర్క్ చేశారని దిల్ రాజు కూడా ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారని అల్లు అర్జున్ ఈ సినిమా కి తమ డేట్లు అడ్జస్ట్ చేస్తే ఈ సినిమా పూర్తి అయ్యే అవకాశం ఉన్నదట. మరి అల్లు అర్జున్ ఈ సినిమా కోసం డేట్ లను కేటాయిస్తాడో లేదంటే ఈ సినిమాని అట్టకెక్కిస్తారో తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే .

Read more RELATED
Recommended to you

Latest news