రాహుల్‌తో రేవంత్ స్కెచ్..హస్తం గ్రాఫ్ పెరుగుతుందా? 

-

ఈ సారి ఎలాగైనా తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగానే కష్టపడుతుంది..ఇప్పటికే రెండు సార్లు అధికారానికి దూరమయ్యి…అనేక మంది నాయకులలని చేజార్చుకుని వీక్ అయిన హస్తం…ఇప్పుడు నిదానంగా బలపడి అధికారం దక్కించుకుని, తెలంగాణలో తమకు తిరుగులేని బలం ఉందని నిరూపించుకోవాలని చూస్తుంది. అయితే ఇప్పటికే పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గట్టిగానే కష్టపడుతున్నారు.

ఓ వైపు టీఆర్ఎస్, బీజేపీలపై పోరాడుతూనే..మరోవైపు పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికల్లో కూడా సత్తా చాటని విషయం తెలిసిందే. పైగా బీజేపీ ఫామ్ లోకి వచ్చింది. దీంతో కాంగ్రెస్ రేసులో వెనుకబడింది…అయితే ఎన్నికల్లో గెలవకపోయిన తమ సత్తా తగ్గదలేని నిరూపించే కార్యక్రమాలు రేవంత్ రెడ్డి చేస్తున్నారు…తాజాగా వస్తున్న సర్వేల్లో కూడా కాంగ్రెస్ బలం తగ్గిందని వస్తున్న సరే ఏ మాత్రం తగ్గకుండా రేవంత్ దూకుడుగా రాజకీయం మొదలుపెట్టారు.న

అవన్నీ బోగస్ సర్వేలు అని కొట్టిపారేస్తూ తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని గట్టిగా చెబుతూ కాంగ్రెస్ శ్రేణులని నిరాశ పడకుండా చూసుకుంటున్నారు. అదే సమయంలో సాధ్యమైన మేర పార్టీ గ్రాఫ్ పెంచడానికి చూస్తున్నారు.

ఇదే క్రమంలో రాష్ట్రానికి రాహుల్ గాంధీని తీసుకొచ్చి…పార్టీ శ్రేణుల్లో మరింత ఊపు తేవాలని చూస్తున్నారు. ఇప్పటికే ఒకసారి రాహుల రాష్ట్రానికి రాగా, అప్పుడు భారీ సభతో రేవంత్ సక్సెస్ అయ్యారు. ఇక తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17న కూడా రాహుల్ ని తీసుకొచ్చి భారీ సభ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.

 

అలాగే అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి రాహుల్ పాదయాత్ర మొదలుపెట్టనున్నారు….కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేయనున్నారు. దేశ వ్యాప్తంగా 3600 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయడానికి రాహుల్ సిద్ధమవుతున్నారు. ఇదే క్రమంలో రాహుల్ తెలంగాణలో కూడా పాదయాత్ర చేయనున్నారు… మక్తల్‌ వద్ద తెలంగాణలోకి రాహుల్ ఎంటర్ అవుతారు.. నారాయణపేట్‌, కొడంగల్‌, పరిగి, వికారాబాద్‌, ఉమ్మడి నిజామాబాద్‌లోని పలు ప్రాంతాల మీదుగా మహారాష్ట్రకు రాహుల్‌ వెళ్తారని రేవంత్ చెబుతున్నారు. ఈ పాదయాత్రని భారీ స్థాయిలో సక్సెస్ చేసేందుకు రేవంత్ రెడీ అవుతున్నారు. పాదయాత్రకు అడుగడుగున జనం నీరాజనం పలికేలా ఏర్పాట్లు చేయనున్నారు.

ఈ పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు తీసుకురావాలని చూస్తున్నారు…అలాగే పాదయాత్ర ద్వారా పార్టీ గ్రాఫ్ మరింత పెరిగేలా చూసుకోవాలని రేవంత్ ప్లాన్ చేసుకుంటున్నారు. మరి చూడాలి రాహుల్ పాదయాత్ర తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ కు కొత్త ఊపు వస్తుందేమో.

Read more RELATED
Recommended to you

Latest news