చిరంజీవి గుప్త దానాల వెనుక రహస్యం ఇదేనా..?

-

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయన సినిమాలలోనే కాదు.. దానాలు చేయడంలో కూడా మెగాస్టారే.. ఎప్పటికప్పుడు తన దాన గుణాన్ని విస్తరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. 1980 నుంచి మెగాస్టార్ ఈ ఛారిటీ బోర్డులోకి వచ్చినా . 1988 నుంచి పూర్తిస్థాయిలో కంస్ట్రక్టివ్ గా ఛారిటీలకు ఒక రూపం కలిగిస్తూ ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంక్ నెలకొల్పారు. ఇన్నేళ్లలో ఇతరత్రా ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా రక్తదానాన్ని మాత్రం మెగాస్టార్ చిరంజీవి వదిలేయలేదు. చాప కింద నీరులా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సేవలను విస్తరిస్తూనే ఉన్నారు.

ఏటా తాను రక్తదానం చేస్తూ తన అభిమానులతో పాటు పెద్ద సంఖ్య లో యువతను ఆ దిశగా నడిపిస్తూ చిరంజీవి ముందుకు సాగుతున్నారు. కరోనా సమయంలో కూడా నిర్మాణాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించారు.. ఎంత సంపాదించిన చివరికి ఏమి కూడబెట్ట లేకపోయారని అందుకే తన కుటుంబానికి ఆస్తులు కూడబెట్టాలి అన్నట్లుగా మొదట్లో ఉండేవాడినని చిరంజీవి తెలిపారు .కానీ ఇప్పుడు జీవితంలో డబ్బు అవసరం లేదని.. పిల్లలందరూ మంచి స్థాయిలో స్థిరపడ్డారని ఇప్పుడు వారి కోసం కూడా పెట్టాల్సిన అవసరం తనకు లేదని కూడా తెలిపారు.

కీర్తి , గ్లామర్ శాశ్వతం కాదని.. వ్యక్తిత్వమే శాశ్వతమని నమ్ముతానని.. అందుకే తన జీవితాన్ని ఛారిటీకే అంకితం చేస్తున్నానని తెలిపారు చిరంజీవి..ఇకపై నా జీవితం ఛారిటీకే అంకితం.. ఎంతైనా దానం చేస్తాను.. చేస్తున్న సినిమాల ద్వారా వస్తున్న డబ్బు కూడా చారిటీకే ఉపయోగిస్తున్నాను అంటూ తన గుప్త దానాల వెనుక ఉన్న రహస్యాన్ని వెల్లడించారు. నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన విడుదల కాబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news