కష్టసమయంలో ఇండియాను ఆదుకున్న “హార్దిక్ పాండ్య – ఇషాన్ కిషన్”

-

ఈ రోజు ఆసియా కప్ లో భాగంగా ఇండియా మరియు పాకిస్తాన్ జట్ల మధ్యన హోరాహోరీగా మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ ఇండియాను రోహిత్, కోహ్లీ మరియు శ్రేయాస్ అయ్యర్ లు కొంప ముంచారు, స్వల్ప స్కోర్ కే మూడు కీలక వికెట్లు పడిపోవడంతో ఇండియా కష్టాల్లో పడింది. ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కీపర్ బ్యాట్స్మన్ ఇషాన్ కిషన్ మరియు హర్ధిక్ పాండ్య లు అయిదవ వికెట్ కు 132 పరుగులు భాగస్వామ్యన్ని నమోదు చేశారు. దాదాపుగా ఇండియా పరువు మొత్తాన్ని తమ భుజాలపై ఇద్దరూ మోశారు. ఏ మాత్రం తేడా జరిగి ఉన్నా ఇండియా చాలా తక్కువ స్కోర్ కు ఆల్ అవుట్ అయ్యేది. కానీ ఇషాన్ కిషన్ మరియు హార్దిక్ పాండ్యా లు కాస్త సమయంలో ఉన్న ఇండియాను ఆపద్బాంధవుల్లా ఆదుకుని జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ ను అందించారు.

వీరిద్దరూ తృటిలో సెంచరీ లను సాధించడంలో ఫెయిల్ అయ్యారు.. కీలక సమయంలో అనవసర షాట్ లు ఆడి ఇద్దరూ తమ వ్యక్తిగత స్కోర్ లు వరుసగా ఇషాన్ కిషన్ 82 పరుగులు, హార్దిక్ పాండ్య 87 పరుగులు చేసి అవుట్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news