సూర్యూడిపై పరిశోధనకు ఆదిత్య ఎల్‌ 1ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో

-

ఆదిత్య ఎల్1 మిషన్ను విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో. ఆదిత్య ఎల్1ను మోసుకెళుతున్న పీఎస్ఎల్వీ రాకెట్ శనివారం ఉదయం 11 గంటల 50 నిమిషాలకు శ్రీహరికోట నుంచి నింగిలోకి ఎగిరింది. వందలాది మంది ఔత్సాహికులు శ్రీహరికోటకు తరలివెళ్లి, ఆదిత్య ఎల్1 లాంచ్ను లైవ్లో వీక్షించారు.

చంద్రయాన్-3 తర్వాత ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. సూర్యుడి గురించి పరిశోధనలకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్ కూడా ఇదే అవడం ఇక్కడ ఇంకో గొప్ప విషయం. చంద్రుడిపై సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయిన నాలుగో దేశంగా ఇండియాను చరిత్ర రాసింది. నూతన ఉత్తేజంతో ఈ సోలార్ మిషన్ లాంచ్ను పూర్తిచేసింది.

ఈ ఆదిత్య ఎల్1 భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణించి, లాగ్రేజియన్ పాయింట్ 1(ఎల్1) వద్దకు చేరుకుంటుంది. ఇందుకు దాదాపు 4 నెలల సమయం పడుతుందని ఇస్రో తెలిపింది. అయితే ఎల్1 పాయింట్కు చేరుకోవడం అంత తెలికైన పనేం కాదు. ఈ టాస్క్ను పూర్తి చేసేందుకు ఇస్రో లిక్విడ్ అపోజీ మోటార్ (ఎల్ఏఎం)ను రూపొందించింది.

ఈ మిషన్ ప్రధాన లక్ష్యాలను ఇస్రో తెలిపింది. కొరొనల్ హీటింగ్, సౌర మంటలు, కొరొనల్ మాస్ ఇజెక్షన్స్, సౌర గాలులు, భూమికి సమీపంలోని అంతరిక్ష వాతావరణ వంటి వాటిపై పూర్తిస్థాయిలో ఆదిత్య ఎల్‌ 1 పరిశోధనలు జరుపుతుంది. ఈ ఆదిత్య ఎల్1లో 7 పేలోడ్స్ ఉంటాయి. వీటిల్లో విజిబుల్ ఎమిషన్ లైన్ కొరొనాగ్రఫీ ఒకటి. నిర్దేశిత కక్ష్యలోకి చేరుకున్న అనంతరం.. ఇది భూమికి, రోజుకు 1440 ఇమేజ్లను పంపిస్తుంది. మొత్తం 7 పేలోడ్స్లో నాలుగింటింటి సూర్యుడి ఖాంతిని అబ్సర్వ్ చేసేందుకు వినియోగిస్తోంది ఇస్రో. మరో మూడింటినీ ప్లాస్మా, మాగ్నెటిక్ ఫీల్డ్స్ వంటి వాటిపై పరిశోధనల కోసం వాడుతోంది.

ఆదిత్య ఎల్1 జీవితకాలం ఐదేళ్లు. అప్పటివరకు భూమికి ఫొటోలు పంపుతుంది. అయితే ఇంధనం ఖర్చు చేసే ఆధారంగా ఇది 5ఏళ్ల కన్నా ఎక్కువ కాలం కూడా పనిచేస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news