ఇషాన్ కిషన్: రోహిత్ శర్మ లో ఉన్న బెస్ట్ క్వాలిటీ అదే…

-

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున ఓపెనింగ్ బ్యాట్స్మన్ గా మరియు కీపర్ గా విశేషమైన సేవలను అందిస్తున్న ఇషాన్ కిషన్ తాజాగా తమ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఒక కామెంట్ చేసి వార్తల్లో నిలిచాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కీలక సమయంలో రాణించి ప్లే ఆఫ్ కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచి ఎలిమినేటర్ లో లక్నో ను ఓడించి ఈ రోజు గుజరాత్ తో అమీ తుమీకి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఇషాన్ కిషన్ మాట్లాడుతూ ముంబై ఇండియన్స్ టీం లో యువ ఆటగాళ్లకు కెప్టెన్ నుండి ఎక్కువ సపోర్ట్ ఉంటుందని తెలిపారు. అయితే కొందరు యంగ్ ప్లేయర్లు రోహిత్ శర్మ అంటే భయపడుతూ ఉంటారని… కానీ వీరిలో రోహిత్ తన మాటల ద్వారా కాంఫిడెన్స్ ను పెంచుతారని చెప్పారు.

 

 

రోహిత్ భయ్యా ఎప్పుడూ మ్యాచ్ ఎంత పరిస్థితిలో ఉన్న అట్టిది తీసుకోవద్దని ఫ్రీగా ఆడమని చెబుతారు. ఆ ధైర్యమే ప్లేయర్స్ సక్సెస్ అవ్వడానికి కారణమని ఇషాన్ కిసాన్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news