ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు ఇషాంత్‌ శర్మ ఎంపిక..!

-

ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు టీమిండియా పేసర్‌ ఇషాంత్‌ శర్మ నామినేట్ అయ్యారు. ఇషాంత్‌‌తో పాటు ఆర్చర్‌ అతాను దాస్‌, హాకీ క్రీడాకారిణి దీపికా ఠాకూర్‌, క్రికెటర్‌ దీపక్‌ హుడా, టెన్నిస్‌ ప్లేయర్‌ దివిజ్‌ శరన్‌ సహా 29 మంది అథెట్ల పేర్లను మంగళవారం జరిగిన జాతీయ అవార్డు కమిటీ సమావేశంలో సెలెక్షన్ కమిటీ సిఫార్సు చేసింది. ఇక ఇషాంత్ 97 టెస్టు, మరో 80 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇందులో దాదాను 400 వికెట్లను పడగొట్టాడు.

మరోవైపు స్టార్‌ ఓపెనర్ రోహిత్‌ శర్మ క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్‌గాంధీ ఖేల్‌ రత్న అవార్డుకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఇందులో రోహిత్‌ శర్మతో పాటు రెజ్లర్ వినేశ్‌ ఫోగట్, భారత మహిళల హాకీ టీం కెప్టెన్ రాణి రాంపాల్, టేబుల్ టెన్నిస్ స్టార్ మణికా బాత్రా, రియో ​​పారాలింపిక్స్ బంగారు పతక విజేత మరియప్పన్ తంగవేల పేర్లను క్రీడా శాఖ ప్రతిపాదించింది.

Read more RELATED
Recommended to you

Latest news