ISI Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్…ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ లో ఖాళీలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తాజాగా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్  ISI Recruitment 2021 ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. ఆసక్తి, అర్హత ఉన్న వాళ్లు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

 ISI Recruitment 2021
ISI Recruitment 2021

ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ లో ఇంజనీర్, ఇంజనీర్ అసిస్టెంట్ మొదలైన పోస్టులను భర్తీ చేస్తోంది. అప్లై చేసుకోవడానికి 23 జూలై ఆఖరి తేదీ. పోస్టుల వివరాల్లోకి వెళితే.. ఇంజనీర్ (ఎలక్ట్రికల్) A – 2 పోస్ట్స్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ (సివిల్) A – 3 పోస్ట్స్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్) A – 3 పోస్ట్స్, ఎలక్ట్రీషియన్ A – 14 పోస్ట్స్, ఆపరేటర్-కం-మెకానిక్ (లిఫ్ట్) A – 8 పోస్ట్స్, డ్రైవర్ A -1 పోస్ట్, కుక్ A -1, అసిస్టెంట్ (లైబ్రరీ) A – 6 పోస్ట్స్, అసిస్టెంట్ (లాబరేటరీ) A – 4 పోస్ట్స్ (రేప్రొ-ఫోటో) A -2, అసిస్టెంట్ (ఫార్మ్) A -1.

అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కింద నాలుగు వందల రూపాయలు చెల్లించాలి మరియు ప్రాసెసింగ్ ఫీజు కింద వంద రూపాయలు చెల్లించాలి. SC/ST/PwBD/ExSM మరియు మహిళలు అప్లికేషన్ ఫీజు చెల్లించక్కర్లేదు కానీ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ముందుగా ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చెయ్యాలి https://www.isical.ac.in/.
హోమ్‌పేజీలో, వివిధ రిక్రూట్మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇప్పుడు క్రొత్త పేజీ తెరవబడుతుంది.
నమోదు కోసం లింక్‌పై క్లిక్ చేయండి.
ఇప్పుడు మీరు అవసరమైన వివరాలను రాయండి.
రిజిస్ట్రేషన్ తరువాత, మీరు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడికి యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ వస్తుంది.
ఆ ఐడి పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి.
దరఖాస్తు ఫారమ్ నింపి దరఖాస్తు రుసుము చెల్లించండి.
దరఖాస్తు ఫారం యొక్క హార్డ్ కాపీని డౌన్‌లోడ్ చేసి ఉంచండి.

Read more RELATED
Recommended to you

Latest news