Coal India Recruitment 2021: కోల్ ఇండియాలో ఖాళీలు.. ఇలా అప్లై చెయ్యండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. కోల్ ఇండియా (coal India) కొన్ని రకాల పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల్లోకి వెళితే..

కోల్ ఇండియా /coal India
కోల్ ఇండియా /coal India

మేనేజర్ పోస్టులకి కోల్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి జూలై 29, 2021 ఆఖరి తేదీ. మొత్తం దీని ద్వారా 8 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

అయితే కేవలం ఒకరు ఒక పోస్ట్ కి మాత్రమే అప్లై చేసుకోవాలి అని నోటిఫికేషన్ ద్వారా తెలిపింది. ఖాళీల వివరాలు, అర్హత, విద్యార్హత వంటి వివరాలను ఇక్కడ చూసేయండి. విద్యార్హత లోకి వస్తే.. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ తో పాటు ఐసిఎస్ఐ యొక్క అసోసియేట్ లేదా ఫెలో సభ్యత్వంతో కంపెనీ సెక్రటరీ అర్హతను పొందాలి. లా లేదా చార్టర్డ్ అకౌంటెంట్‌లో ఫుల్ టైం యుజి / పిజి డిగ్రీని కూడా కలిగి ఉండవచ్చు.

వయో పరిమితి:

జనరల్ మేనేజర్ (Company Secretary)E-8 గ్రేడ్ 55 ఏళ్ళు

సీహెచ్. మేనేజర్ (Company Secretary) E-7 గ్రేడ్ 52 ఏళ్ళు

సీనియర్ మేనేజర్ (Company Secretary) E-6 గ్రేడ్ 48 ఏళ్ళు

ఎంపిక ప్రక్రియ

అభ్యర్థి ఎంపిక అర్హత, రివెలెంట్ పోస్ట్ అర్హత అనుభవం మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తును జనరల్‌కు పంపాల్సి ఉంటుంది

ఎడ్రస్: Manager (Personnel/Recruitment), Coal India Limited, Coal Bhawan, Premise No-04-1111, Af111, Action Area-1a, New Town, Rajarhat, Kolkata- 700156.

వెబ్సైట్: coalindia.in

 

Read more RELATED
Recommended to you

Latest news