వరుసగా సీనియర్ నటులు మృతి చెందడం బాధాకరం – రేవంత్ రెడ్డి

-

ఈ ఏడాది వరుసగా సీనియర్ నటులు మృతి చెందడం బాధగా ఉందన్నారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, నేడు చలపతిరావు.. ఇలా వరుసగా మరణించడం చిత్ర రంగానికి తీరనిలోటని అన్నారు. చలపతిరావు ఆకస్మిక మృతి పట్ల రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు చలపతిరావు ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. బంజారాహిల్స్ లోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు చలపతిరావు. 1944 మే 8న కృష్ణాజిల్లా బల్లిపర్రులో చలపతిరావు జన్మించారు. ఆయనకి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. దాదాపు 1200 కు పైగా సినిమాలలో నటించారు చలపతిరావు. 1966 లో గూడచారి 116 చిత్రంతో సినీ రంగంలో అడుగు పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news