మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ ఒకటి. ప్రతీ ఒక్కరికీ ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ ఎన్నో వాటికి అవసరం అవుతుంది. ఆధార్ లేకపోతే చాలా పనులు ఆగిపోతాయి. ప్రభుత్వ, ప్రైవేటు స్కీమ్‌లకు కూడా ఆధార్ కార్డు కావాల్సిందే. ఆధార్ సంస్థ యూఐడీఏఐ ఆధార్ కి సంబంధించి ముఖ్య విషయాలని మొసలి ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటుంది.
ఆధార్ జారీ చేసే సంస్థ యూఐడీఏఐ బయోమెట్రిక్ అప్‌డేట్ గురించి కూడా ముఖ్య విషయాలను చెప్పింది. తాజాగా ఓ కీలక సమాచారాన్ని వెల్లడించింది. ఇక వాటి వివరాలని చూస్తే.. అన్ని రాష్ట్రాలు దాని అధికారిక పరిధిని పెంచాలని కోరింది యూఐడీఏఐ. అయితే ప్రతీ పదేళ్లకు ఓ సారి ఆధార్, బయోమెట్రిక్‌లను అప్‌డేట్ చేసేలా చూడాలని చెప్పింది.
ఆధార్ కార్డు ని ప్రతీ ఒక్కరు కూడా అప్డేట్ గా ఉంచాలని అంది. అయితే ఇలా చేసుకోవడం ఎవరి బలవంతం కాదని అంది. కానీ అప్డేట్ చేస్తే తాజా వివరాలు అప్‌డేట్ అవుతాయని అంది. ఫేక్ బేసిస్ కూడా అరికట్టబడుతుందని చెప్పింది. ప్రతి ఒక్కరి డేటా కూడా పూర్తిగా భద్రంగా ఉంటుందని చెప్పింది. ప్రతి పదేళ్లకు బయోమెట్రిక్స్, డెమోగ్రాఫిక్ వివరాలను అప్‌డేట్ చేస్తే మంచిది. my Aahdaar పోర్టల్‌ను సందర్శించడం ద్వారా ఆధార్ కార్డు ని అప్డేట్ చెయ్యచ్చు. ఆధార్ కేంద్రం కి వెళ్లి కూడా ఆధార్ కార్డ్‌ని అప్‌డేట్ చేసుకోవచ్చు.