బ్యాంకింగ్ ఐడీ, పాస్‌వర్డ్ మర్చిపోయారా..? ఇలా లాగిన్ అవ్వండి..!

-

ఈ మధ్య కాలంలో ప్రతీ ఒక్కరు ఆన్ లైన్ పేమెంట్స్ ని చేస్తున్నారు. అయితే ఆన్ లైన్ పేమెంట్స్ ని చేసేటప్పుడు లాగిన్ అవ్వాల్సి వుంది. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవల విషయంలో వినియోగదారులు ఎక్కువగా వారి పేరుని పాస్‌వర్డ్స్‌ ని మరచిపోతున్నారు. స్టేట్ బ్యాంక్ వినియోగదారులు కూడా ఈ తప్పు చేస్తున్నారు. అయితే స్టేట్ బ్యాంక్ అకౌంట్ వున్నవాళ్లు కనుక వాళ్ళ పేరుని పాస్‌వర్డ్స్‌ ని మరచిపోతే ఏం చెయ్యాలి అనేది చూద్దాం.

యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ రెండింటినీ తిరిగి ఎలా పొందాలి..? ఏం చేయాలి..? అనేది చూసేద్దాం. స్టేట్ బ్యాంక్ ఖాతాదారులు ఐడీ, పాస్‌వర్డ్ ని తప్పనిసరిగా జాగ్రత్తగా ఉంచుకోవాలి లేదంటే పేమెంట్స్ చెయ్యడం కుదరదు. ఒకవేళ మీరు మీ యూజర్ నేమ్ ని మరచిపోతే ఇలా చెయ్యండి.

దీని కోసం మొదట మీరు onlinesbi.com ని సందర్శించాలి. అక్కడ ‘Forgot Use Name’ మీద క్లిక్ చేయాలి.
ఇప్పుడు 11 అంకెల సిఐఎఫ్ నెంబర్‌ను ఎంటర్ చేసి దేశాన్ని సెలెక్ట్ చెయ్యాలి.
రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ను నొక్కి…. క్యాప్చా కోడ్‌ను కూడా ఇవ్వండి.
ఇప్పుడు వచ్చిన ఓటీపీ ని ఎంటర్ చేసేసి ‘కన్‌ఫామ్’ ఆప్షన్‌పై నొక్కండి.
రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఎస్‌బిఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ వస్తుంది.

పాస్‌వర్డ్ ని ఇలా పొందండి:

onlinesbi.com వెబ్‌సైట్‌కి వెళ్లి Forgot Password మీద నొక్కండి.
ఇక్కడ అడిగిన డీటెయిల్స్ ని ఇవ్వండి.
ఇమెయిల్ అడ్రస్‌కు కొత్త పాస్‌వర్డ్ ని పంపిస్తారు.
ఆ పాస్‌వర్డ్‌తో సైన్ ఇన్ అవ్వాలి. ఆ తరువాత మీ ఖాతాను సురక్షితంగా ఉంచడానికి మీకీ నచ్చినట్టు మార్చుకోండి.

 

Read more RELATED
Recommended to you

Latest news