రోజులు మారతాయని గుర్తు పెట్టుకోవాలి.. కూటమి ప్రభుత్వానికి అంబటి రాంబాబు వార్నింగ్

-

విద్యుత్ రంగంపై శ్వేత పత్రం విడుదల చేశారని, అది తప్పుల తడకగా ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.గుంటూరులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..చంద్రబాబు మొదట శాంతి భద్రతలపై శ్వేత పత్రం విడుదల చేయాలనుకున్నారని, ఆ తర్వాత వాయిదా వేసుకున్నారని పేర్కొన్నారు.

ఆయన ఎందుకిలా చేశారో అందరికీ తెలుసని అంబటి రాంబాబు చెప్పారు. తమ పాలనలో కంటే ఈ 45 రోజుల్లో ఇప్పుడు ఎక్కువుగా శాంతిభద్రతలకు విఘాతం కలిగిందని విమర్శించారు. వినుకొండలో జరిగిన హత్య రాజకీయ హత్య కాదని చెబుతున్నారని ఆయన అన్నారు. జిలాని గతంలో తమ పార్టీలో ఉన్నారని అన్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పడి 45 రోజుల తర్వాత కూడా గంజాయి దొరికితే ఆ పాపం వైసీపీదా అని అంబటి రాంబాబు నిలదీశారు.హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనిత బాధ్యతగా మాట్లాడాలని ,అధికారంలో ఉన్నవారు వైసీపీని దూషిస్తూ కాలయాపన చేయకూడదని సూచించారు. కేంద్ర హోంమంత్రికి అన్ని వివరాలు ఇస్తామని, జగన్ రోడ్డు మీదకు వస్తే నష్టపోయేది రాష్ట్రం కాదని, తెలుగుదేశం పార్టీనేనని చెప్పారు. రోజులు మారతాయని గుర్తు పెట్టుకోవాలని ఆయన వార్నింగ్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news