సిద్దిపేట జిల్లాకు ఐటి టవర్ రానుంది. ఈ విషయాన్ని తెలంగాణా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రూ.45 కోట్లతో కొండపాక మండలం దుద్దెడ గ్రామం వద్ద నిర్మాణం చేపడుతున్నారు. ఐ టి టవర్ నిర్మానానికి పరిపాలన అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. హైదరాబాద్ రోడ్డులో రాజీవ్ రహదారి ని ఆనుకుని సువిశాల 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటి టవర్ నిర్మాణం చేపడుతున్నారు.
జిల్లాకు ఐటి టవర్ మంజూరు పట్ల మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేసారు. ఐటి టవర్ నిర్మాణం తో జిల్లా నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు రానున్నాయి అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కి మంత్రి హరీష్ రావు ధన్యవాదాలు చెప్పాడు. ఈ నెల 10న ఐటి టవర్ నిర్మాణానికి సిఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమంత్రి సమక్షంలో ఇన్ఫోసిస్ సహా పలు ప్రముఖ ఐటి సంస్థలతో ఐటి శాఖ ఉన్నతాధికారులు ఎంవోయు చేసుకుంటారు.