కరోనా విబృంభనతో ఇటలీ బెంబేతెత్తిపోతోంది. ప్రపంచం మొత్తం కరోనా విస్తరిస్తున్నా.. ఇటలీలోనే అధిక మరణాలు నమోదవుతున్నాయని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. కరోనా మూలంగా అ«ధిక మరణాల రేటు అమేరికా, బ్రెజిల్లో ముందుండగా ఆ తర్వాత ఇటలీలో జరుగుతున్నాయి. రోజూ 600లకు పైగా కరోనా కాటుకు ప్రాణాలు కోల్పోతున్నారని అధిక మరణాల రేటులో ఇటలీ ఐదోస్థానానికి చేరడం మరింత కలవరపెడుతోందని ఆ దేశ ప్రజలు భయాందోలనకు గురవుతున్నారు.
అధికంగా వారే..
కరోనా కాటుకు బలి కావడానికి ఆ దేశ ప్రజల వయస్సే ప్రధాన కారణమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలో అత్య«ధిక వృద్ధ జనాభాలో జపాన్ తర్వాత ఇటలీనే. మరణాల్లోనూ 65 సంవతర్సాలు పైబడిన వారే ఎక్కువగా ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. ఇటలీలో దాదాపుగా 22.8 శాతం జనాభా 65 ఏళ్లకు మించిన వారే ఉండటం గమన్హరం. దీంతో కరోనా మహమ్మారితో వీరు ప్రాణాలు కోల్పోతున్నారని స్పష్టమవుతోంది.
రికార్డు స్థాయిలో..
ఇటలీలో ప్రతి లక్ష జనాభాలో దాదాపు 15 మంది కరోనా కాటుతో మృత్యువాత పడుతున్నారు. జర్మనీలో 6.9, స్పెయిన్‌లో 6.3, ఫ్రాన్స్‌లో 8.3 శాతంగా ఉంది. యూరప్‌లో సెకండ్‌వేవ్ ప్రారంభ కావడం, దీనికి తోడు చలికాలం రావడంతో మరోసారి కరోనా విరుచుకుపడుతున్నట్లు తెలిసింది. దీంతో అప్రమత్తమన ఆ దేశ ప్రభుత్వం మళ్లీ లాక్డౌన్ వైపు అడుగులు వేసింది. నూతన సంవత్సరం 6వ తేదీ వరకు ఆంక్షలు విధించింది.