లెబనాన్ లోని బీరూట్ లో జరిగిన భారీ పేలుడు ధాటికి 78 మంది ప్రాణాలు కోల్పోయారు అని 4 వేల మంది వరకు గాయపడ్డారు అని అక్కడి ప్రభుత్వం చెప్పింది. 2,700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ # బీరుట్ పేలుడుకు దారితీసిందని అక్కడి అధికారులు పేర్కొన్నారు. పేలుడు తీవ్రతకు మరణాలు వందల్లో ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. వందలాది మంది ప్రాణనష్టం జరిగిందని లెబనీస్ రెడ్‌క్రాస్ అధికారి జార్జెస్ కెట్టనేహ్ చెప్పడం గమనార్హం.
ఈ పేలుడు తీవ్రత ధాటికి నగరం మొత్తం కూడా షేక్ అయిపోయింది. పక్కన ఉన్న భవనాలు ఒక్కసారిగా ఊగిపోయాయి. ఈ తీవ్రతలో మరణాలు ఎక్కువగా ఉండి ఉండవచ్చు అని నిపుణులు చెప్తున్నారు. దీనితో వారం పాటు నగరం మొత్తం కూడా కర్ఫ్యూ విధించింది అక్కడి ప్రభుత్వం. దీనికి సంబంధించిన వీడియో లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
Explosion in #Beirut #Lebanon – view from Annahar building. Praying for everyone’s safety 🙏🏼😓 pic.twitter.com/Zf6fXaahUq
— Fady Roumieh (@FadyRoumieh) August 4, 2020