ఆ ప్రముఖ హాస్పిటల్ పై తెలంగాణ సర్కార్ వేటు..!

-

కరోనా పేరుతో ప్రజల నుంచి అధిక డబ్బు వసూలు చేసిన మరో ఆస్పత్రిపై తెలంగాణ ప్రభుత్వం వేటు వేసింది. బంజారా హిల్స్‌లోని విరించి ఆస్పత్రిలో కరోనా వైద్యం చేసే అనుమతులను రద్దు చేసింది. విరించి ఆస్పత్రిలో కరోనా పేషెంట్ల నుంచి రోజుకి రూ. లక్ష చొప్పున వసూలు చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే అధిక బిల్లులు వేశారని నిన్న డెక్కన్‌ ఆస్పత్రిలో కోవిడ్‌ చికిత్స అనుమతిని ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అసలు పేషెంట్ల నుంచి రోజుకి రూ.10 వేలకు మించి తీసుకోకూడదని ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది.

అయినా సరే కొన్ని ఆస్పత్రులు మాత్రం దీనికి విరుద్ధంగా లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. కాగా, ఈ మహమ్మారి చికిత్సకు ఇస్తున్న మందులు 15 పైసల ట్యాబ్లెట్లు, రూ. 10ల ఇంజెక్షన్లే తప్ప వేలాది ఖరీదు చేసే ఇంజెక్షన్లు లేవని ఇప్పటికే మంత్రి ఈటెల తెలిపారు. అసలు కరోనా చికిత్స అంతా కలిపితే రూ. 1000లకు మించదని నిపుణుల కమిటీ చెప్పిందని మంత్రి ఈటెల తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news