ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చైనాని హెచ్చరిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఉక్రెయిన్ కు వ్యతిరేకంగా రష్యాకు చైనా మద్దతు ప్రకటిస్తే అది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని హెచ్చరించారు. చైనా తమ పక్షాన ఉండాలని కోరుకుంటున్నామని, కానీ అది సాధ్యం కాకపోవచ్చు అని అభిప్రాయపడ్డారు.
ఆ దేశం రష్యా కు మద్దతు ప్రకటించకుండా ఉండడం తమకు చాలా ముఖ్యమని చెప్పారు. తమ రెండు దేశాల మధ్య ఏం జరుగుతుందన్న దానిపై చైనా ఆచరణాత్మక విశ్లేషణ చేసుకోవాలని కోరారు. ఒకవేళ ఉక్రెయిన్ కు వ్యతిరేకంగా రష్యాకు చైనా మద్దతు ప్రకటిస్తే అది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని అన్నారు.