నిమ్మగడ్డ vs ఏపీ సర్కార్ : సర్కార్ ను తప్పు పట్టిన ఐవైఆర్  

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్నికల కమిషనర్ లు మరో రాజ్యాంగ సంక్షోభానికి దారి తీసే విధంగా ప్రవర్తిస్తున్నారని అంటూ ఏపీ మాజీ సీఎస్, ప్రస్తుత బీజేపీ నేత ఐవైఆర్ పేర్కొన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన అనుకరణ ప్రకారం  ఎన్నికల నిర్వహణ అధికారం  ఎలక్షన్ కమిషనర్ దేనని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించటం అంటే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి అని కాదన్న ఆయన రాజ్యాంగంలో అంత స్పష్టంగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడితే కోర్టులో ఈసారి  అక్షింతలతోనే ఆగిపోక పోవచ్చని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ చర్యలు వివేక రహితంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయన పేర్కొన్నారు. అలాగే కొద్ది సేపటి క్రితం ఆయన మరో ట్వీట్ చేశారు. ఇక్కడ ఈ కేసులో మెరిట్స్ డీ మెరిట్స్ గురించి మాట్లాడటం లేదన్న ఆయన ఈ కేసులో ఉన్న రాజ్యాంగ హక్కుల గురించి మాట్లాడుతున్నా అని అన్నారు.