జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చిన ఎంతోమంది ఆర్టిస్టులు ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అవుతున్నారు . ఇక అంతే కాకుండా మరికొంత మంది వీటిని విడిచి వెళ్లి పోలేక చాలా సతమతమవుతున్నారు. అంతేకాకుండా ఎక్కువగా సినిమాలలో కూడా వీరికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అతి తక్కువ సమయంలోనే జబర్దస్త్ షో ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న వారిలో ఫైమా కూడా ఒకరు. అయితే ఈమె బుల్లితెరపై కి రాకముందు ఎన్నో కష్టాలని ఎదుర్కొకునట్లుగా తెలియజేస్తోంది. వాటి గురించి పూర్తి వివరాలు చూద్దాం.పటాస్ షో ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యింది ఫైమా. ఆ తర్వాత ఎక్స్ ట్రా జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇందులో బుల్లెట్ భాస్కర్, ఇమ్మానియేల్ తో చేసే స్కిట్లలో బాగా పాపులర్ అయ్యింది. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని బాగా నవ్విస్తు ఉంటుంది. అయితే జబర్దస్త్ ప్రయాణం వెనుక ఆమె అసలు లక్ష్యం వేరే ఉన్నదట. ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు జబర్దస్త్ లో తన ప్రయాణం మొదలైన విషయాలపై ఒక ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను తెలియజేసింది.తన తల్లి బీడీలు చుట్టి.. వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో ని తమకు ఏం కావాలన్నా తీసిచ్చేదని తెలియజేసింది. అయితే తన అమ్మ కోరిక మాత్రం తనకు మంచి పేరు సంపాదించుకోవాలని ఎప్పుడూ చెబుతూ ఉండేదట. ఇక ఈమె అక్కాచెల్లెళ్లకు చిన్న వయసులోనే వివాహం చేశారని తెలియజేసింది. మొత్తం వీరంతా నలుగురు అక్క చెల్లెలు అవ్వగా ఇందులో ముగ్గురికి వివాహమై పోయాయట. ఇక మంచి పేరు అంటే ఎలా తీసుకొస్తారో తనకు తెలిసేది కాదు కానీ మల్లెమాల ద్వారా తను ఒక మంచి పేరు తీసుకు వచ్చానని.. దీంతో తన అమ్మ కల నెరవేరిందని తెలిపింది.
ఇక జబర్దస్త్ రాకముందు వరకు తనకి డ్రీమ్స్ ఏమీ లేవని.. చదువులో కూడా చాలా వెనుక బడే దాన్ని.. చేసేదేమీలేక మిషన్ బట్టలు కుట్టడం నేర్చుకొని జీవనం సాగించాలి అనుకునేదాన్ని కానీ అనుకోకుండా అవకాశం రావడంతో ఇటువైపుగా వచ్చానని తెలిపింది. ఇక తమకు సొంతిల్లు లేదని.. కాబట్టి మాకంటూ ఒక ఇల్లు ఉంటే బాగుంటుందని ఉద్దేశంతోనే ఒక ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేసింది ఫైమా.