తన ప్రేయసి పై షాకింగ్ కామెంట్లు చేసిన జబర్దస్త్ యాక్టర్..!!

ప్రతి వారము ప్రసారమయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రతి ఒక్క ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇందులో ఆటో రాంప్రసాద్, ఇమ్మాన్యుయేల్, వర్ష, రాకింగ్ రాకేష్ వంటి కమెడియన్లు తమ స్కిట్లతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉన్నారు. అయితే ఈ శుక్రవారం ప్రసారమయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. ఇక ఇందులో నుంచి సుధీర్, గెటప్ శీను వంటి వారు దూరం కాగా..ప్రస్తుతం ఉన్న కమెడియన్లతోనే నవ్విస్తూ ఉన్నారు మల్లెమాల సంస్థ వారు.

ప్రస్తుతం ఎక్స్ ట్రా జబర్దస్త్ లో రాకింగ్ రాకేష్ కూడా సీనియర్ కమెడియన్ గా పేరు పొందారు. మంచి స్కిట్లతో ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా రాకింగ్ రాకేష్, సుజాత లవ్ స్టోరీ కూడా ఈ మధ్యకాలంలో బాగా ఆకర్షణీయంగా మారుతుంది. వీరిద్దరూ జంటగా ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా వీరిద్దరూ ఎక్స్ట్రా జబర్దస్త్ లో టైటానిక్ స్కూప్ తో అలరించడం జరిగింది. రాకింగ్ రాకేష్ జాక్ గా సుజాత రోస్ గా నవ్వులు పూజించారు.

ఇక స్కిట్ కూడా ఎంతో హాస్యంగా పండించే విధంగా కనిపిస్తోంది. రియల్ లైఫ్ జోడి అయిన రాకేష్, సుజాత మధ్యలో ప్రేమ గురించి చెప్పే మాటలు కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇటీవల రాకింగ్ రాకేష్ చేసిన ఒక స్కిట్లు ది బెస్ట్ స్కిట్ అంటూ కూడా ఇంద్రజ ప్రశంసలు కురిపించింది. ఈ స్కిట్ పూర్తి అయిన వెంటనే రాకింగ్ రాకేష్ సుజాత తన లైఫ్ గురించి ఎలా మొదలైందో వివరించడం జరిగింది. సుజాత ఒక ఛానల్ లో యాంకర్ గా పనిచేస్తున్నప్పుడు ఇంటర్వ్యూకు పిలిచిందని మధ్యలో నన్ను చాలా ప్రశ్నలు కూడా అడిగిందని తెలియజేశారు. ఆ ఇంటర్వ్యూలోని మాటలు ఆమెకు బాగా కనెక్ట్ అవ్వడం వల్ల రాకింగ్ రాకేష్ కి పడిపోయినట్లుగా తెలియజేశారు.