తప్పు చేసిన వాడి తోలు తీసేసేలా శాంతి భద్రతలను నిర్వహిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నా నుంచి అద్భుతాలు ఆశించొద్దు….నేను సీఎంను కాను.. ముద్దుల మామయ్యను కానని ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. సమస్యలను పరిష్కారించేలా మా వంతు ప్రయత్నం చేస్తానని.. ఎక్కువ మంది దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్తానని చెప్పారు.
ఏపీకి సమర్థుడైన నాయకుడు లేడని.. వచ్చే ఎన్నికల్లో గెలవాలి..? ప్రత్యర్థి పార్టీలను ఎలా ఇబ్బంది పెట్టాలనే విషయంలో అధికార పార్టీకి సమర్ధత ఉందని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. గెలిపిస్తే బాధ్యతతో కూడిన పరిపాలన అందిస్తామని… తప్పు చేసిన వాడి తోలు తీసేసేలా శాంతి భద్రతలను అద్భుతంగా నిర్వహిస్తామన్నారు.
మాట ఇస్తే మడమ తిప్పననే వాళ్లు విదేశాల్లో తిరుగుతున్నారు…రాజకీయం అంటే బూతులు తిట్టడం కాదని ఫైర్ అయ్యారు. సమస్యల పరిష్కారానికి మా వంతు ప్రయత్నం చేస్తామని… వ్యవసాయం, టిడ్కో ఇళ్లకు సంబంధించిన సమస్యలు ప్రధానంగా మా దృష్టికి వచ్చాయన్నారు. వాలంటీర్లు సంతకం పెట్టని కారణంగా కూడా పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు.