కోమటి రెడ్డి బ్రదర్స్ వి బ్రోకర్ దందాలు, బ్రోకర్ మాటలు – తెలంగాణ మంత్రి

-

కోమటిరెడ్డి బ్రదర్స్ వి బ్రోకర్ దందాలు, బ్రోకర్ మాటలేనని మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. నారాయణపురం మండలం పుట్టపాక లో కార్యకర్తల విస్తృత సమావేశంలో పాల్గొన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మునుగోడు లో ఎగిరేది గులాబీ జెండాయేనని… కాషాయం కనుచూపు మేరలో లేదని మండిపడ్డారు.

మాకు ఇక్కడ పోటీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని.. అన్ని సర్వేలు తేల్చి చెబుతున్న నిజాలు ఇవన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు రాజకీయ జీవితాన్నిచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని… ఆ పార్టీ పతనం అంచున చేరేసరికి బిజెపి పాట పాడుతున్నారని మండిపడ్డారు.

అన్ని నియోజకవర్గాలకు నిధులు సమానమని.. అబద్దాలు చెప్పడంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ను మించినోళ్లు లేరని చురకలు అంటించారు. మూడేండ్ల నుండి బిజెపికి కోవర్ట్ గా రాజగోపాల్ రెడ్డి పనిచేస్తున్నాడని.. కాంట్రాక్టుల ఒప్పందం కుదరగానే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడని ఆగ్రహించారు. రాజీనామా చేస్తే ఉప ఎన్నికలే వస్తాయని ఎద్దేవా చేశారు మంత్రి జగదీశ్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news