తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల నడుమ ఇప్పుడు కృష్నా జలాల వివాదం నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అనూహ్యంగా ఏపీ ప్రాజెక్టులపై కేసీఆర్ ప్రభుత్వం యుద్ధం ప్రకటించి అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే మంత్రులను రంగంలోకి దింపిన కేసీఆర్.. పక్కా ప్లాన్ ప్రకరామే కొందరితో కౌంటర్లు వేయిస్తున్నారు. అయితే ఇప్పుడు మరో మంత్రి జగదీశ్‌రెడ్డి Jagadish Reddy రంగంలోకి దిగారు.
ఇప్పటి వరకు మహబూబ్‌నగర్ మంత్రి, నేతలు తీవ్ర స్థాయిలో జగన్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు. కాగా వీరంతా గులాబీ బాస్ కేసీఆర్ డైరెక్షన్‌లోనే విమర్శలు చేసినట్టు చర్చ జరుగుతోంది. కాకాపోతే ఆయన డైరెక్టుగా రంగంలోకి దిగకుండా మంత్రులతో ప్లాన్ వర్కౌట్ చేస్తున్నారు.
ఇప్పుడు తాజాగా నల్లగొండ మంత్రి జగదీశ్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. శ్రీశైలం ప్రాజెక్టులో తమ ప్రభుత్వం చేస్తున్న జల విద్యుత్ ఉత్పత్తిని ఆపుతామని ఏపీ మంత్రులు చెబుతున్నారని, అది ఎంతకూ సాధ్యం కాదని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తిని ఆపడం జగన్ ప్రభుత్వ తరం కాదని సవాల్ విసిరారు. తమ వాటా మేరకు కచ్చితంగా నీళ్లు ఉన్నంత వరకు విద్యుత్ ను ఉత్పత్తి చేస్తామని తేల్చి చెప్పారు. ఏపీ ప్రభుత్వం అహంకార ధోరణిలో వ్యవరించడంపై మండిపడ్డారు. మొత్తానికి కేసీఆర్ మంత్రులతో బాగానే ప్లాన్ వర్కౌట్ చేస్తున్నారు.