ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమిత్ షా ను కలిసి అనేక అంశాలను చర్చించారు. నేడు కూడా జగన్ ఢిల్లీలోనే ఉండి పలువురు కేంద్రమంత్రులను కలిసిన రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలపై వివరించారు. అయితే తెలంగాణా లో ఉన్న స్టీఫెన్ రవీంద్రను ఏపీ చీఫ్ గా ఇంటెలిజెన్స్ తీసుకోవాలని జగన్ ఎప్పటి నుంచో కేంద్రాన్ని కోరుతున్నారు.
ఇప్పుడు మళ్లీ అదే అంశాన్ని నిన్న అమిత్ షా ను కలిసినప్పుడు దీనిపై చర్చించారు అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నిబంధనలు అనుకూలించక కేంద్ర హోమ్ శాఖ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదనకు అంగీకారం తెలపడం లేదు. స్టీఫెన్ రవీంద్రతో పాటు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ సైతం ఏపీకి వెళ్లేందుకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆమె కూడా ఇందులో సక్సెస్ కాలేకపోయారు.
మరోసారి స్టీఫెన్ రవీంద్ర కోసం సీఎం జగన్ ఢిల్లీలో మరోసారి లాబీయింగ్ మొదలుపెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డి ఎంత వరకు సక్సెస్ అవుతారనేది వేచి చూడాలి. ఇప్పటికే ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి విషయంలో కేంద్రం నుంచి జగన్ కి ఎదురు దెబ్బ తగిలిందని, మరి స్టీఫెన్ విషయంలో ఎం జరుగుతుందో చూడాలని ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. శ్రీలక్ష్మి కూడా కేంద్రాన్ని పలు మార్లు కోరారు.