ప్రస్తుతం టాలివుడ్ లో కోలివుడ్ లో బాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్ల హవా ఎక్కువగా నడుస్తుంది అనేది వాస్తవం. వరుసగా సినిమా ఆఫర్లు కొట్టేసే వారిలో సీనియర్ హీరోయిన్లే ముందు వరుసలో ఉన్నారు అనేది వాస్తవం. టాలివుడ్ లో సీనియర్ హీరోయిన్లకు మంచి డిమాండ్ ఉంది. అటు తమిళంలో కూడా సీనియర్ హీరోయిన్ల వెంటపడుతున్నారు. దీనితో హీరోయిన్లు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని భావిస్తున్నారు.
చాలా మంది స్టార్ హీరోయిన్లు ప్రస్తుతం అదే జాబితాలో ఉన్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. వారిలో ముందు వరుసలో ఉంటున్నారు నయనతార, కాజల్. ఈ ఇద్దరికీ ఆఫర్లకు వచ్చిన కొదవ ఏమీ లేదనే చెప్పాలి. నయనతార గురించి చూస్తే ఆమె వస్తున్న ఆఫర్ల కోసం ఏమైనా చేయడానికి రెడీ అంటుంది. ఇన్నాళ్ళు చీర కట్టులో సాంప్రదాయంగా నటించిన ఆ భామ ఇప్పుడు వరుసగా ఆఫర్లు కొడుతుంది.
ఇందుకోసం తాను లిప్ లాక్, బికినీలకు రెడీ అంటుంది. తదుపరి సినిమాల్లో అలాగే నటించడానికి సిద్దమవుతుంది. ఇకపోతే కాజల్ తాను ఎక్స్పోజింగ్ చేయడానికి సిద్దంగా ఉన్నాను అనే సంకేతాలు ఇస్తూ వస్తుంది. దీనితో వీరి కోసం కుర్ర హీరోయిన్లు కూడా ఎగబడే పరిస్థితి ప్రస్తుతం టాలివుడ్ లో, కోలీవుడ్ లో నెలకొంది. చూపు తిప్పుకోలేని విధంగా తన మాయాజాలంలో పడేస్తుంది. తాజాగా విడుదలైన ఫోటోషూట్లో అమ్మడి చూపులు చూస్తుంటే అదే అర్ధమవుతుంది. ఇక లిప్ లాక్స్ కి కూడా తాను సిద్దమని అంటుంది కాజల్.