ఒక్కో పోర్టులో నేరుగా వచ్చే ఉద్యోగాలు 3–4వేలు : సీఎం జగన్‌

-

ఒక్కో పోర్టులో నేరుగా వచ్చే ఉద్యోగాలు 3–4 వేలు వస్తాయని ప్రకటించారు సీఎం జగన్‌. రామాయపట్నం పోర్టు పనులకు సీఎం వైయస్‌.జగన్‌ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చెన్నై అయినా, విశాఖ అయినా, ముంబై అయినా మహానగరంగా ఎదిగాయంటే అక్కడ పోర్టు ఉందని.. పోర్టు రావడం వల్ల ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు.

ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి.. పోర్టు వల్ల ట్రాన్స్‌పోర్టు ఖర్చుకూడా బాగా తగ్గుతుందని తెలిపారు. రాష్ట్రానికే కాదు, ఈప్రాంతం రూపురేఖలు మారుతాయని.. రాష్ట్రంలో ఎక్కడ ఏ పరిశ్రమల వచ్చినా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం తీసుకు వచ్చామని ప్రకటించారు.

మరో 100 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా సామర్థ్యం వస్తుందని.. దీంతో పాటు 9 ఫిషింగ్‌ హార్బర్లు కూడా కడుతున్నామని స్పష్టం చేశారు. వీటి నిర్మాణాలు వేగవంతంగా కొనసాగుతున్నాయి.. త్వరలోనే మరో 2 నెలల్లో మిగిలిన పోర్టులకు భూమి పూజ చేస్తామన్నారు. 9 ఫిషింగ్‌ హార్బర్లు, 4 పోర్టులతో మౌలిక సదుపాయాలు ఊపందుకుంటున్నాయి.. 9 ఫిషింగ్‌ హార్బర్ల ద్వారా దాదాపు లక్షమందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. గుజరాత్‌ లాంటి రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news