తెలంగాణలో కరోన వైరస్ కట్టడి విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా వరకు సంచలన నిర్ణయాలే తీసుకున్నారు. జనతా కర్ఫ్యూ ని పొడిగించడమే కాదు… లాక్ డౌన్ విషయంలో కేంద్రం తో సంబంధం లేకుండా నిర్ణయం తీసుకోవడం దాన్ని చాలా జాగ్రత్తగా అమలు చేయడం, హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాల్లో అమలు చేస్తున్న ఆంక్షలు అన్నీ కూడా కరోనా కేసులు పెరగకుండా అడ్డుకునే పరిస్థితి చూస్తున్నాం. ఇక కేసీఆర్ మాట్లాడే మాటలు, ఆయన తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా దేశం జాగ్రత్తగా వింటుంది.
ఇప్పుడు కేసీఆర్ ఏ నిర్ణయం అయితే తీసుకుంటున్నారో ఏపీ సీఎం జగన్ కూడా అదే విధంగా కొద్దిగా అటు ఇటు గా అవే తీసుకుంటున్నారు. కేంద్రం లాక్ డౌన్ ప్రకటించక ముందే లాక్ డౌన్ కేసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత ఏపీలో లాక్ డౌన్ అన్నారు. కేసీఆర్ ఏ సూచనలు ఏ విధంగా అయితే చేస్తున్నారో అవే సూచనలు జగన్ దాదాపుగా చేస్తున్నారు. ప్రసంగంలో కూడా అవే విషయాలు ఉంటున్నాయి. రైతుల విషయంలో కేసీఆర్ నిర్ణయం తీసుకున్న తర్వాతే జగన్ కూడా నిర్ణయం తీసుకున్నారు.
ఇక ఇప్పుడు లాక్ డౌన్ విషయంలో కూడా దాదాపుగా అదే జరిగింది. కేసీఆర్ పొడిగించే నిర్ణయం తీసుకున్న తర్వాతే జగన్ కూడా తీసుకున్నారు. సమీక్షా సమావేశాలు కూడా కేసీఆర్ నిర్వహించిన తర్వాతే జగన్ కూడా నిర్వహిస్తున్నారు. మాస్కులను తెలంగాణా పెట్టామన్న తర్వాత జగన్ కూడా అదే ఆదేశాలు ఇచ్చారు. ఉమ్ము వేయవద్దు అని కేసీఆర్ సర్కార్ రాష్ట్రంలో ఆదేశాలు ఇచ్చాక ఏపీలో జగన్ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం కేసులను ప్రకటించిన కాసేపటికి ఏపీ ప్రభుత్వం కూడా హెల్త్ బులిటెన్ విడుదల చేస్తుంది.