రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్..!

-

ఏపీ సీఎం జగన్ రైతులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు.. ఈ మేరకు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఇకపై చిరుధాన్యాలు, ఆపరాల బోర్డులు ఏర్పాటు చేసేందుకు జగన్ నిర్ణయించారు. రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ఈ బోర్డులు కృషి చేస్తాయి.

ఈ కొత్త బోర్డులు చిరు ధాన్యాలు, అపరాల పంటల ప్రణాళిక, మార్కెటింగ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై దృష్టి సారిస్తాయి. నీటి వసతి లేని భూములను గుర్తించి సాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటాయి. మారుతున్న జీవన విధానంలో చిరు ధాన్యాల వినియోగానికి ప్రాధాన్యం పెరిగింది. ఈ సమయంలో ఈ నిర్ణయం రైతులతో పాటు ప్రజలకూ మేలు చేసేదే.

ఇప్పటి వరకూ ఈ చిరుధాన్యాలు, అపరాల కోసం ప్రత్యేకంగా బోర్డు లేకపోవడం వల్ల ఈ రైతుల సమస్యలు చెప్పుకునే వేదిక కరవైంది. వీరి గోడు పట్టించుకునే వారే కనిపించలేదు. ఇప్పుడు బోర్డుల ఏర్పాటుతో చిరుధాన్యాలు, అపరాలు పండించే రైతుల సమస్యలు కొంత వరకూ గట్టెక్కే అవకాశం ఉంది. కేవలం బోర్డుల ఏర్పాటుతో సరిపుచ్చకుండా వాటిని సమర్థంగా నడిపించినప్పుడే అసలైన మేలు జరిగేది.

ఈ బోర్డుల ఏర్పాటు సమయంలో మంత్రి మండలి గత ప్రభుత్వంపై విమర్శలు కూడా చేసింది. గడిచిన ప్రభుత్వంలో పౌరసరఫరాల పేరుతో వారికి ఉన్న క్యాష్‌ క్రెడిట్‌ నిల్వలు రూ.20 వేల కోట్లు ఉన్నా.. వాటిని చంద్రబాబు డ్రా చేసి పసుపు-కుంకుమకు మళ్లించారని ఆరోపించింది. ఇవాళ ధాన్యం కొనుగోలు చేయాలంటే డబ్బులు లేకుండా చేశారని మండిపడింది. సివిల్‌ సఫ్లై కార్పొరేషన్‌ను చంద్రబాబు దివాలా తీయించారని విమర్శించింది.

Read more RELATED
Recommended to you

Latest news