పరిపాలన పరంగా సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించే విధానంలో వైఎస్ జగన్ దేశంలోనే అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. చాలా విషయాలలో యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటున్న నిర్ణయాలు వైయస్ జగన్ ని బెస్ట్ సీఎంగా సర్వేలు నిలబెట్టాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ప్రభావం దక్షిణాదిలో అన్ని రాష్ట్రాలలో దారుణంగా ఉంటే మాత్రం ఏపీలో కంట్రోల్ లో ఉండటం పట్ల జగన్ పరిపాలనపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఇందులో పెద్ద పాత్ర పోషించడంతో..విదేశాల నుండి ఎవరు వచ్చారో వారి వివరాలు త్వరగా సేకరించడంతో…చాలావరకు కంట్రోల్ అయింది. అంతా బాగానే ఉన్నా గానీ కొన్ని విషయాల్లో మాత్రం జగన్ నిర్ణయాలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. చాలా విషయాలు ఇంగ్లీష్ మీడియం ఇంకా కొన్ని విషయాలు ప్రజలంతా స్వాగతించిన గాని వాటిపై ప్రత్యర్ధులు కోర్టుకు వెళ్లిన టైములో…ప్రభుత్వం తరఫున వాదించే లాయర్ విషయంలో ప్రభుత్వం సరైన ఎన్నిక లేకపోవటంతో..మంచి మంచి నిర్ణయాలు న్యాయస్థానంలో డీలా పడిపోతున్నాయి.
ఇలాంటి లా పాయింట్ లో ప్రభుత్వం తరపున పోరాడే న్యాయవాది జగన్ నిర్ణయాలు న్యాయస్థానంలో గట్టిగా వాదించే ఆపద్బాంధవుడు రంగంలోకి దింపాలని వైసిపి పార్టీ మద్దతుదారులు కోరుతున్నారు.