ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. రాష్ట్ర పీఆర్సీ విధానానికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం స్వస్తి పలికింది. అంటే ఈ లెక్కన ఇక నుంచి సెంట్రల్ పే కమిషన్ -సీపీసీ సిఫార్సులనే అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారన్న మాట. ఈ మేరకు ఉత్తర్వుల్లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఐదేళ్ళకు ఒకసారి పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి వాటి సిఫార్సులకు అనుగుణంగా జీతభత్యాలు, పెన్షన్లను నిర్ధారించే సాంప్రదాయాన్ని ఇప్పటి వరకు కొనసాగించింది. పదేళ్లకు ఒకసారి పే కమిషన్ ఏర్పాటు విధానాన్ని కేంద్రం అనుసరిస్తుంది. ఇక నుంచి సొంతంగా పే రివిజన్ కమిషన్ ను ఏర్పాటు చేసే బదులు సీపీసీ ఇచ్చే సిఫార్సులనే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయనుంది. దేశంలో ఇప్పటికే సీపీసీ విధానంలోకి పలు రాష్ట్రాలు మళ్లాయి. ఈ నేపథ్యంలోనే… జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే తరహాలో ముందుకు వెళుతుంది.