ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు, అలాగే ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ప్రతి రోజు 4 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం అందరినీ షాక్ గురి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే… ఏపీలోని జగన్ మోహన్ రెడ్డి సర్కార్.. సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఇవా ళ్టి నుంచి నైట్ కర్ఫ్యూ ను విధించాలని జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంది.
దీంతో కరోనా వ్యాప్తి దృష్ట్యా ఇవాళ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు కానుంది. ఈ నెల చివరి వరకు నైట్ కర్ఫ్యూ అమలు కానుంది. జనవరి 31 తర్వాత కరోనా కేసులు పెరిగితే.. ఈ నైట్ కర్ఫ్యూ గడువు పెరిగే ఛాన్స్ ఉండనున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. కాగా.. నిన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కరోనా విజృంభణ, వ్యాక్సినేషన్ ప్రక్రియపై వైద్య శాఖ అధికారులతో కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కరోనా కట్టడి చర్యలకు నడుం కట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.