నెల్లూరుజిల్లాలో ముత్తుకూరులో ఆయుర్వేదం కోవిడ్ మందు పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఆయుర్వేదం మందుకోసం పలు ప్రాంతాల నుంచి వేలాది మంది వస్తున్నారు. పలు ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీ చేసి ఆక్సిజన్ పెట్టుకుని కోవిడ్ రోగులు ముత్తుకూరు వస్తున్నారు. ఆయుర్వేదం మందు పంపిణీ కి అనుమతి ఇవ్వాలా వద్దా అనే అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టి పెట్టారు.
ఆయుర్వేదం మందు పంపిణీ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కాసేపట్లో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఉన్నతాధికారులతో సమావేశమై ఆయుర్వేదం మందు శాస్త్రీయత ,పనిచేసే విధానం పై తెలుసుకుంటారు. ఇప్పటికే అధికారుల బృందం చేసిన పరిశీలన ,నివేదికపై జగన్ చర్చిస్తారు. ఆయుర్వేదం మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలా వద్దా అనే అంశంపై జగన్ స్వయంగా నిర్ణయ ప్రకటిస్తారు. ఒకవేళ పంపిణీ కి అనుమతిస్తే ప్రభుత్వ పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించి జగన్ ఆదేశాలు ఇస్తారు.