జగన్ ఉపాధ్యాయులను వైన్ షాపుల వద్ద కాపలా నిలబెట్టి అవమానించాడు: చంద్రబాబు

-

సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న సమయంలో ఆంధ్ర ప్రదేశ్ లో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. అధికార ప్రతిపక్షాలు మేనిఫెస్టో కూడా విడుదల చేసిన నేపథ్యంలో ఎన్నికల హడావిడి రసవత్తరంగా మారింది.

ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నేతల మాటల యుద్ధం కూడా తార స్థాయికి చేరింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జగన్ విద్య విలువ తెలియని వ్యక్తి అని, కరోనా సమయంలో ఉపాధ్యాయులను వైన్ షాపుల వద్ద కాపలా నిలబెట్టి అవమానించారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

అభివృద్ధిని గాలికి వదిలేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంపద సృష్టించి, వచ్చిన ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు అన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా చేయగల సత్తా ఉన్న పార్టీ టీడీపీ అని ఆయన అన్నారు. జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల భూములను లాక్కునే కుట్ర చేస్తున్నారని, తమ ప్రభుత్వం వస్తే ఈ యాక్ట్ ని రద్దు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news