మరణమృదంగం.. టర్కీ, సిరియాల్లో 24వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య

-

టర్కీ, సిరియాల్లో భూకంపాలు వేల మంది ప్రాణాలు పొట్టనపెట్టుకున్నాయి. మరెంతో మందిని క్షతగాత్రులను చేశాయి. ఇంకొంత మందిని తమ ఆత్మీయులకు దూరం చేశాయి. ఈ రెండు దేశాల్లో ఎటు చూసినా భవన శిథిలాలే.. ఎక్కడ కాలు పెట్టినా మృతదేహాలే.. ఏవైపు చూసినా మరణఘోషలే. ఇప్పటి వరకు ఈ రెండు దేశాల్లో కలిపి 24వేలకు పైగా మంది మరణించారు. ఇది కచ్చితంగా ఇంకా పెరిగే అవకాశమే ఉందని అక్కడి పరిస్థితులు చెబుతున్నాయి.

కొందరు ఇంకా భవనాల శిథిలాల కిందే ఉన్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. 101 గంటల పాటు వారంతా ఓ భవన శిథిలాల కింద చిక్కుకుపోయారు. తినడానికి ఆహారం, తాగడానికి నీళ్లు లేకపోయినా ప్రాణాలు నిలబెట్టుకున్నారు. టర్కీలో సహాయక చర్యలు చేపడుతున్న బలగాలు గాజియాంతెప్‌లో ఈ మృత్యుంజయులను శుక్రవారం సురక్షితంగా బయటకు తీసుకురాగలిగాయి.

ప్రాణాలతో ఉండేందుకు నాలుగు రోజులకు పైగా వారు పడిన ఆరాటం గురించి తెలిశాక అక్కడివారి కళ్లు చెమర్చాయి. ఈ ప్రాంతం భూకంప కేంద్రానికి చేరువగా ఉంది. నాలుగు రోజులుగా రెప్పవాల్చకుండా నిరీక్షిస్తున్న కుటుంబాలు కాస్త ఊరడిల్లాయి. ప్రాణాలతో బయటపడినవారిని ఆసుపత్రులకు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news