ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల నేపధ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు అంతా రహస్యంగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం చేయకూడదు అని భావిస్తున్న జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు ఏడుగురి పేర్లు రాజ్యసభ విషయంలో కీలకంగా వినపడుతున్నాయి. ముఖ్యంగా అయోధ్య రామిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, చిరంజీవి సహా పలువురి పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు జగన్ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. రాజ్యసభలో అనుభవం ఉన్న నేత కావాలని భావిస్తున్న ఆయన గతంలో కేంద్ర మంత్రిగా పని చేసిన జలవనరుల నిపుణుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ని రాజ్యసభకు పంపడానికి సిద్దమైనట్టు సమాచారం. రాష్ట్రంలో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్ ల గురించి ఆయన అయితే సమర్ధవంతంగా వివరిస్తారని, ఆయన్ను పంపిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది అని భావిస్తున్నారు జగన్.
త్వరలో ఆయన్ను రాజ్యసభకు పంపడానికి పార్టీలో కీలక నేతలను కూడా ఒప్పించారు జగన్. ఆయనతో పాటుగా చిరంజీవిని దాదాపుగా ఖరారు చేసారు సిఎం. అలాగే బీదా మస్తాన్ రావుతో పాటుగా మరో కీలక నేతను ఎంపిక చేసారు. ఇక ఇదిలా ఉంటే ఎన్డియే లో వైసీపీ చేరే అవకాశాల మీద జగన్ చర్చలు జరుపుతున్నారు. ఎన్డియే లో చేరితే మాత్రం రెండు స్థానాలను వారికి ఇచ్చే అవకాశం ఉంది అనేది పార్టీ నేతల మాట.