ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీడియా సమావేశం ఇప్పుడు మరోసారి విమర్శలకు వేదికగా మారింది. కీలక సమయంలో మీడియా ముందుకి రావాల్సిన జగన్ మాట్లాడే మాటలు ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. ఆయన శనివారం సాయంత్రం మీడియా ముందుకి వచ్చారు. ప్రజలను ఉద్దేశించి ఒక వీడియో సందేశం ఇచ్చారు. దీనినిని లైవ్ అనే వాళ్ళు కూడా ఉన్నారు.
అయితే రికార్డ్ అని అర్ధమవుతుంది. తెలంగాణా ముఖ్యమంత్రి మీడియా ముందుకి వచ్చి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా మాట్లాడుతూ ప్రజలకు ధైర్యం చెప్తుంటే జగన్ మాత్రం మీడియా ముందుకి వచ్చి ఎప్పుడూ ఏదోక వివాదంలో ఇరుక్కుంటున్నారు. రాష్ట్రంలో ఎన్ని కేసులు ఉన్నాయి… ఎంత మంది చనిపోయారు. ఏయే జిల్లాలో ఎన్ని కేసులు ఉన్నాయి అనే ఏ ఒక్క విషయాన్ని కూడా జగన్ తన మీడియా సమావేశంలో ప్రస్తావించలేదు.
టీవీ సౌండ్ పెంచే లోపు అయిపోయింది అనే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. జగన్ మాట్లాడింది కూడా ఏమీ లేదు. తబ్లీగీ జమాత్ వాళ్ళను వెనకేసుకుని వచ్చి ఆయన మీడియా సమావేశం ముగించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారు. మోడీ ఇచ్చిన పిలుపుని కూడా విజయవంతం చెయ్యాలని సూచించారు. దేని కోసం మీడియా ముందుకు రావడం ఎందుకు ట్విట్టర్ లో ఒక వీడియో పెడితే సరిపోతుంది కదా అంటున్నారు.