ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక అధికారిని ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మైనింగ్ జాయింట్ డైరెక్టర్ డబ్ల్యు.బి. చంద్రశే ఖర్ ను సస్పెండ్ చేస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. లీజుదారులతో దురుద్ధేశపూర్వకంగా కుమ్మక్కయ్యారంటూ ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ప్రాథమిక విచారణ జరిపిన ఏపీ ప్రభుత్వం ఆయనను దోషిగా తేల్చింది.
ప్రాథమిక సాక్ష్యాధారాలుండటంతో సస్పెండ్ చేసినట్టు ఉత్తర్వుల్లో పంచాయితీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ఈ మేరకు అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. అవినీతి విషయంలో సిఎం జగన్ సర్కార్ దూకుడుగా వెళ్తుంది. ఎక్కడా కూడా అవినీతిని క్షమించేది లేదు అని స్పష్టం చేస్తుంది.