ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక సిబీఎస్ఈ సిలబస్ !

-

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు మన బడి నాడు – నేడుపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష జరిపారు. ఈ సంధర్భంగా నాడు నేడు కింద మౌలిక సదుపాయాలు మార్చిన స్కూళ్ల ఫొటోలు పరిశీలించిన సీఎం రాష్ట్ర వ్యాప్తంగా పక్కా భవనాలు లేని 390 పాఠశాలలకు భవనాల నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ సమీక్షలో సీబీఎస్‌ఈ విధానంపై సీఎం కీలక ప్రకటన చేశారు.

jagan
jagan

2021–22 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 7వ తరగతి వరకూ సీబీఎస్‌ఈ విధానం అమలు చేయాలనీ. తర్వాత తరగతులకు ఒక్కో ఏడాదీ అమలు చేయాలనీ ఆదేశించారు. 2024 విద్యా సంవత్సరానికల్లా సీబీఎస్‌ఈ విధానంలోకి 1 నుంచి 10 తరగతి వరకూ విద్యార్థులు వస్తారని పేర్కొన్నారు. విద్యా కానుకలో ఇంగ్లిషు – తెలుగు డిక్షనరీని చేర్చాలని, విద్యా కానుక కిట్‌లో ఈసారి తప్పనిసరిగా డిక్షనరీ ఉండాలని అన్నారు. పాఠ్య పుస్తకాలు క్వాలిటీగా ఉండాలన్న ఆయన ప్రైవేటు స్కూళ్లలో ఇస్తున్న పుస్తకాల నాణ్యతతో పోటీగా ఉండాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news