అష్టదిగ్బంధనం : చంద్రబాబు మీద జగన్ నయా మిస్సైల్ .. !

-

వైయస్ జగన్ 2019 ఎన్నికల్లో భారీ స్థాయిలో మెజార్టీ సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో 23 మంది సభ్యులు కలిగిన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న చంద్రబాబుని నేలమట్టం చేస్తారని అందరూ భావించారు. చంద్ర బాబు లాగానే తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుని అసెంబ్లీలో చంద్రబాబు కి ప్రతిపక్ష పాత్ర లేకుండా జగన్ చేస్తాడని అందరూ భావించారు. అయితే ఆ టైంలో అసెంబ్లీ స్టార్ట్ అయిన సందర్భంలో ఆ విధంగా చేస్తే తనకి చంద్రబాబుకు పెద్ద తేడా ఏమీ ఉండదని నిజాయతీ రాజకీయాల కు జగన్ విలువ ఇచ్చారు. Image result for ys jagan chandrababuఎవరైనా తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీ లోకి రావాలంటే కచ్చితంగా రాజీనామా చేయాలని ఆ టైంలో జగన్ తెలిపారు. దీంతో జగన్ నిజాయతీ రాజకీయాల అడ్డంపెట్టుకుని ఇష్టానుసారంగా ప్రస్తుతం చంద్రబాబు రెచ్చిపోతున్నారు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నాయకుల పై గొడవలు పెట్టుకోవటం, మరియు అదే విధంగా చంద్రబాబు ఎన్నికల కమిషనర్ చేత ఎన్నికలను వాయిదా వేయించటం తో…చంద్రబాబుని అష్టదిగ్బంధనం చేసే విధంగా జగన్ నయా మిస్సైల్ రెడీ చేసినట్లు సమాచారం.

 

ఇక విలువైన రాజకీయాలు పక్కనపెట్టి తన పార్టీలోకి రావాలనుకుంటున్న టిడిపి ఎమ్మెల్యేలకు డోర్లు తెరవాలని చంద్రబాబు ని పూర్తిగా దెబ్బకొట్టాలని జగన్ డిసైడ్ అయ్యాడట. ఈ దెబ్బతో ప్రధాన ప్రతిపక్ష హోదా ఎగిరిపోతుంది. అదే సమయంలో శాసనమండలి కూడా రద్దు చేయిస్తే చంద్రబాబును రెండు రకాలుగాను దెబ్బ కొట్టినట్లవుతుందని జగన్ డిసైడ్ అయినట్లు వైసీపీ పార్టీలో వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news