వైసీపీ పార్టీలో జగన్ తర్వాత స్థానంలో విజయ్ సాయి రెడ్డి అని చాలా మంది అంటారు. జగన్ రాజకీయ వ్యవహారాలన్నీ ముందుగానే విజయసాయిరెడ్డి చూసుకుంటారని ఆ తర్వాత జగన్ దృష్టికి వెళుతుందని వైసీపీ పార్టీలో ఉన్న ముఖ్యమైన నాయకులే కామెంట్ చేస్తుంటారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా విశాఖపట్టణంలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటున్న విజయసాయి రెడ్డి పై ఊహించని ఆరోపణలు రావడంతో ఆ వార్త ఏపీ మీడియా వర్గాల్లో అదేవిధంగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జగన్ ఈ వార్త విని ఆశ్చర్యపోయినట్లు సమాచారం.
మేటర్ లోకి వెళ్తే విశాఖపట్టణం నగరం లో మూడు రాజధానులలో ఒక రాజధాని నియమించాలని జగన్ ఆలోచిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే 3 రాజధాని విషయంలో చాలా దూకుడుగా ఉన్న జగన్ వికేంద్రీకరణ బిల్లునిఅడ్డుకొన్న శాసనమండలిని రద్దు బిల్లును అసెంబ్లీలో ఆమోదింప చేయడం జరిగింది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది శాసనమండలి రద్దు బిల్లు.
ఇటువంటి నేపథ్యంలో విశాఖపట్టణంలో ఖరీదైన భూములపై విజయసాయిరెడ్డి కన్ను పడినట్లు వాటిని స్వాధీనం చేసుకోవడానికి వాటికి సంబంధించిన వివరాలను విశాఖపట్టణం మునిసిపల్ అధికారుల దగ్గర నుండి సేకరించే పనిలో విజయసాయిరెడ్డి పడినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ వార్తలు వైరల్ కావడంతో జగన్ దాకా వెళ్లడంతో జగన్ షాక్ అయినట్లు వైసిపి పార్టీ లో గుసగుసలు వినబడుతున్నాయి.